News August 18, 2024

క్రిష్- 4లో శ్రద్ధా కపూర్?

image

రాకేశ్ రోషన్ సూపర్ హీరో ఫ్రాంచైజీ క్రిష్- 4 పట్టాలెక్కనుంది. ఈ ఫ్రాంచైజీలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ భాగం కానున్నట్లు బీటౌన్ టాక్‌. గ‌తంలో శ్ర‌ద్ధా ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ ‘జాదూ లాంటి ఎండ కావాలి’ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి హృతిక్ స్పందిస్తూ.. ‘అత‌ను వ‌స్తున్నాడు – అతనికి చెప్తాను’ అంటూ రిప్లై ఇవ్వడంతో క్రిష్‌- 4లో శ్ర‌ద్ధా క‌న్ఫామ్ అంటూ క‌థ‌లు అల్లేస్తున్నారు.

Similar News

News February 12, 2025

సినీ పరిశ్రమకు మేం వ్యతిరేకం కాదు: పుష్ప శ్రీవాణి

image

AP: విశ్వక్‌సేన్ ‘లైలా’ సినిమాకి తాము వ్యతిరేకం కాదని YCP నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తమపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే తాము వ్యతిరేకం అని, సినీ పరిశ్రమకు కాదని పేర్కొన్నారు. YCPపై జోకులు వేసే ఆర్టిస్ట్ నటించే ప్రతి సినిమాని బాయ్‌కాట్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘టికెట్ కొనుక్కొని మరీ మా మీద మీతో జోకులు వేయించుకొనేంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదు’ అని ట్వీట్ చేశారు.

News February 12, 2025

త్వరలో గూగుల్ మెసేజెస్ యాప్ నుంచే వాట్సాప్ కాల్స్!

image

గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా WhatsApp వీడియో కాల్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా Google meet వీడియో కాల్స్ మాత్రమే చేసుకునేందుకు వీలుంది. అయితే యాప్స్‌ను స్విచ్ చేసుకునే బదులు, యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ తీసుకొస్తోంది. తొలుత వన్ ఆన్ వన్ కాల్స్‌కు మాత్రమే ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ అయి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది.

News February 12, 2025

నేడే మూడో ODI.. జట్టులోకి పంత్, అర్ష్‌దీప్?

image

ఇండియా, ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. IND తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. ఈ పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు కఠినంగా, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, డ్యూ కూడా వచ్చే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. sports 18-2, హాట్‌స్టార్‌లో మ.1.30 నుంచి లైవ్ చూడవచ్చు. WAY2NEWSలో లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.

error: Content is protected !!