News November 15, 2024
శ్రద్ధా వాకర్ హత్య: అఫ్తాబ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ ‘స్కెచ్’
రెండేళ్ల క్రితం దేశంలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో పట్టుబడ్డ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శివకుమార్ ఈ విషయం చెప్పినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పూనావాలాకు భద్రత పెంచడంతో ఆ నిర్ణయాన్ని గ్యాంగ్ విరమించుకున్నట్లు చెప్పారు. శ్రద్ధను పూనావాలా చంపి 35 ముక్కలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 15, 2024
IPL వేలంలో 13 ఏళ్ల పిల్లాడు
IPL 2025 మెగా వేలం షార్ట్ లిస్ట్‌లో భారత్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నారు. ఆయన రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలో ఉంటారు. కాగా వైభవ్ బిహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నారు. ఆయన 2011 మార్చి 27న జన్మించారు. భారత అండర్-19 జట్టులో ఆయన ఆడారు. మరోవైపు లిస్టులో అత్యధిక వయసున్న ఆటగాడిగా ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్(42) నిలిచారు.
News November 15, 2024
ఝార్ఖండ్ ఎన్నికల వేళ బీజేపీ వ్యూహం
ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్‌కు గిరిజనుల ఆరాధ్యుడు <<14618652>>బిర్సాముండా పేరు<<>> పెట్టి BJP వ్యూహాత్మక రాజకీయానికి తెరలేపింది. ఝార్ఖండ్‌లో 38 సీట్లకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఝార్ఖండ్ ఏర్పడకముందు 1875-1990 మధ్య కాలంలో ఈ ప్రాంత గిరిజనులకు బిర్సాముండా ఓ ధైర్యం. ఆ స్థాయి ప్రాబల్యం కలిగిన బిర్సా పేరును ఎన్నికల వేళ తెరపైకి తెచ్చి BJP వ్యూహాత్మక రాజకీయం చేస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.
News November 15, 2024
నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే..
కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. రోజుకోసారైనా రుచి చూడాలని తహతహలాడుతుంటారు. కానీ నెలరోజులపాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలపాటు మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.