News April 2, 2025
మరోసారి విచారణకు శ్రవణ్ రావు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. మూడు రోజుల క్రితం ఆయనను విచారించగా అసంపూర్తిగా సమాధానాలు చెప్పారని సమచారం. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు పంపి విచారణకు హాజరుకావాలని సిట్ పేర్కొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో కలిపి ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
NLG: ‘గెలిచినా, ఓడినా నేను ప్రజల మధ్యనే’

ఎమ్మెల్యే వీరేశం తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 25 ఏళ్ల నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని తానని, ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయిలో ప్రజలకు సేవ చేశానని చెప్పారు. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉన్నాను, ప్రజల మధ్యే ఉన్నానన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులకు రెండేళ్లుగా వీరేశం ప్రారంభోత్సవాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు.
News November 28, 2025
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరో షాక్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. మరో 3 అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చిన ఢాకా కోర్టు ఏడేళ్ల చొప్పున మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఒక్కో కేసులో రూ.లక్ష జరిమానా చెల్లించాలని, లేకుంటే మరో 18 నెలలు జైలు శిక్ష పొడిగిస్తామని తీర్పునిచ్చింది. హసీనా కూతురు, కుమారుడిపై నమోదైన కేసుల్లో కోర్టు వారిద్దరికీ 5ఏళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కో లక్ష ఫైన్ కట్టాలని తీర్పునిచ్చింది.
News November 28, 2025
చెక్క దువ్వెన వాడుతున్నారా?

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్వాష్ లిక్విడ్/ షాంపూ, కొబ్బరి, ఆలివ్ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.


