News March 17, 2024
KKR క్యాంపులో చేరిన శ్రేయస్ అయ్యర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుతో చేరారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపులో అయ్యర్ అడుగు పెట్టారు. కాగా అయ్యర్ ఇటీవల వెన్నునొప్పి గాయంతో సతమతమవుతున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్ మధ్యలో గాయంతో వైదొలిగారు. అనంతరం ముంబై తరఫున రంజీల్లో ఆడారు. మళ్లీ వెన్నునొప్పితో బాధపడ్డారు. ప్రస్తుతం అతడు IPLలో ఆడేది కూడా అనుమానమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Similar News
News October 30, 2024
ధంతేరాస్ సీక్రెట్ ఆపరేషన్: భారత్‌కు లక్ష కిలోల బంగారం
ధంతేరాస్‌కు బంగారం కొని ఇంటికి మహాలక్ష్మీని ఆహ్వానించడం హిందువుల సంప్రదాయం. కేంద్ర ప్రభుత్వమూ ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది! బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి ఏకంగా లక్ష కిలోల గోల్డ్‌ను గుట్టుచప్పుడు కాకుండా భారత్‌కు తీసుకొచ్చింది. RBI తాజా రిపోర్టుతో ఈ విషయం బయటకొచ్చింది. మే 31న ఇలాగే 100 టన్నుల బంగారాన్ని నాగ్‌పూర్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం BoE, BIS వద్ద 324 టన్నుల భారత బంగారం నిల్వఉంది.
News October 30, 2024
మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీతో పాటు TG సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య జాబితాలో ఉన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి.
News October 30, 2024
ఆల్ ది బెస్ట్ రామ్: ఎన్టీఆర్
తన సోదరుడు జానకీరామ్ తనయుడు తారక రామారావు మూవీ ఎంట్రీ సందర్భంగా జూనియర్ NTR విష్ చేశారు. ‘తొలి మెట్టు ఎక్కుతున్నావు. ఆల్ ది బెస్ట్ రామ్. సినిమా ప్రపంచం నీకు లెక్కలేనన్ని మధుర క్షణాల్ని అందిస్తుంది. నీకు విజయం చేకూరాలి. మీ ముత్తాత ఎన్టీఆర్, మీ తాత హరికృష్ణ, మీ తండ్రి జానకిరామ్ ఆశీస్సులు నీకు ఉంటాయి’ అని ట్వీట్ చేశారు. వైవీఎస్ చౌదరి డైరెక్షన్లో రామారావు తొలి మూవీ తెరకెక్కనుంది.