News October 11, 2024

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతి హాసన్ ఆగ్రహం

image

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఆలస్యం కావడం పట్ల నటి శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘నేను సాధారణంగా ఫిర్యాదులు చేయను. ఇండిగో.. మీరు సేవల్లో ఎప్పటికప్పుడు దిగజారుతున్నారు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే మగ్గుతున్నాం. దీనిపై మీ నుంచి కనీస సమాచారం లేదు. మీ పాసింజర్ల కోసం మెరుగైన మార్గాల్ని అన్వేషించండి. ప్లీజ్’ అని కోరారు.

Similar News

News November 4, 2024

ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌.. నలుగురు యువకులు మృతి

image

AP: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రులో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2024

ఇంకా 35 రోజులే మిగిలింది.. మీ హామీలెక్కడ?: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదంతా అటెన్షన్ డైవర్షన్‌తో పబ్బం గడిపిందని X వేదికగా KTR విమర్శలు గుప్పించారు. ‘100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 330 రోజులు ముగిశాయి. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, రూ.4వేల పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. జవాబు చెప్తావా రాహుల్ గాంధీ?’ అని ప్రశ్నించారు.

News November 4, 2024

రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల మహా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెర లేవనుంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో 6.8Cr మంది పాల్గొన్నారు. చివరివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్, కమల ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ట్రంప్, కమల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది.