News March 30, 2024

రూ.10వేలు లంచం తీసుకుంటూ దొరికిన SI

image

ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత లంచగొండుల గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోన్న ఎస్సై సైదులు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. ఓ రియల్టర్‌పై నమోదైన కంప్లైంట్‌ను ఉపసంహరించుకునేందుకు సైదులు రూ.10వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.

Similar News

News March 5, 2026

మిడిల్ ఈస్ట్‌లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్‌తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.

News March 5, 2026

‘నేను ఇంటికి వెళ్లాలి’.. వెస్టిండీస్ కోచ్ ఆవేదన!

image

T20 WC నుంచి వెస్టిండీస్ నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉండిపోయారు. ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గగనతల ఆంక్షలతో వారు వెళ్లేందుకు వీలు కాలేదు. ఈ క్రమంలో తనకు ఇంటికి వెళ్లాలని ఉందంటూ వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కనీసం అప్డేట్ ఇవ్వండి. ఎప్పుడు వెళ్తామో చెప్పండి. ఈ రోజా? రేపా? వచ్చే వారమా? ఇప్పటికే 5 రోజులు అవుతోంది’ అని ట్వీట్ చేశారు.

News March 5, 2026

10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

image

బిహార్‌లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.