News June 23, 2024

లండన్‌లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ మాల్యా

image

విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహం లండన్ సమీపంలోని లేడీ వాక్ ఎస్టేట్‌లో నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. సిద్ధార్థ్, అతని స్నేహితురాలు జాస్మిన్ రింగ్స్ మార్చుకుని ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు సమాచారం. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న లేడీ వాక్ ఎస్టేట్‌ను విజయ్ మాల్యా 2015లో కొనుగోలు చేశారు.

Similar News

News November 9, 2024

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరాలు

image

1.టోక్యో (జపాన్)- 3.71 కోట్లు
2.ఢిల్లీ (భారత్)- 3.38 కోట్లు
3.షాంఘై (చైనా)- 2.99 కోట్లు 4.ఢాకా (బంగ్లాదేశ్)- 2.3 కోట్లు
5.సౌ పౌలో (బ్రెజిల్)- 2.28 కోట్లు 6.కైరో (ఈజిప్ట్)- 2.26 కోట్లు
7.మెక్సికో సిటీ (మెక్సికో)- 2.25 కోట్లు
8.బీజింగ్ (చైనా)- 2.21 కోట్లు
9.ముంబై (ఇండియా)- 2.16 కోట్లు
10. ఒసాకా (జపాన్)- 1.89 కోట్లు
**హైదరాబాద్ 1.10 కోట్ల జనాభాతో 32వ స్థానంలో ఉంది.

News November 9, 2024

టెస్టు సిరీస్ ఓటమి: 6 గంటల పాటు మీటింగ్!

image

స్వదేశంలో భారత్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ వైట్‌వాష్‌కి గురవ్వడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, సెలక్టర్ అజిత్ అగార్కర్, బోర్డు పెద్దలు జై షా, రోజర్ బిన్నీ మధ్య 6 గంటల పాటు సుదీర్ఘంగా మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్, గంభీర్‌కు బిన్నీ, షా పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఓటమికి కారణాలపై చర్చ జరిగిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

News November 9, 2024

లీవ్ ఇవ్వలేదని వీడియో కాల్‌లో పెళ్లి.. ఎక్కడంటే?

image

తన బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో ఓ ఉద్యోగి ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకున్న ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. పెళ్లి కూతురు మండిలో పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్‌లో వివాహం చేసుకున్నారు. వధువు తాత అనారోగ్యం పాలవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరుడి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆన్‌లైన్‌లో ఈ నెల 4న నిఖా జరిగింది. గతంలోనూ సిమ్లాకు చెందిన ఓ వ్యక్తి వీడియో కాల్‌లో పెళ్లి చేసుకున్నారు.