News April 6, 2024
అదితిరావుతో ఎంగేజ్‌మెంట్.. సిద్ధార్థ్ స్పందన ఇదే!
హీరోయిన్ అదితిరావు హైదరీతో ప్రేమ, ఎంగేజ్‌మెంట్‌పై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందించారు. ‘నేనే ఆమెకు ప్రపోజ్ చేశా. ఓకే అంటుందా? లేదా? అని ఎంతో టెన్షన్ పడ్డా. చివరికి ఆమె అంగీకరించింది. మేం సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నామని అంటున్నారు. కానీ సీక్రెట్, ప్రైవేటు పదాలకు వ్యత్యాసం ఉంది. ఇది మా కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్. పెద్దల నిర్ణయం ప్రకారం పెళ్లి జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2025
అది సైఫ్ నివాసమని దొంగకు తెలియదు: అజిత్
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నిందితుడికి అది సెలబ్రిటీ నివాసమని తెలియదని, దొంగతనం కోసమే వెళ్లాడని తెలిపారు. అతడు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి తర్వాత ముంబైకి మకాం మార్చాడన్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News January 19, 2025
ఖోఖో.. మనోళ్లు కొట్టేశారంతే!!
ఖోఖో తొలి ప్రపంచకప్‌లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్‌లో నేపాల్‌పై 54-36 తేడాతో టీమిండియా గెలుపొంది తొలి కప్‌ను ముద్దాడింది. అంతకుముందు అమ్మాయిల జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీమ్‌ను 78-40 తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 23 దేశాలు పాల్గొన్నాయి.
News January 19, 2025
డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారుల బెదిరింపులు: ఈటల
TG: హైడ్రా పేరుతో 3 నెలలుగా INC ప్రభుత్వం హంగామా చేస్తోందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీ నగర్, జవహర్ నగర్‌లో పేదలు భూములు కొని 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. ప్రతి పనిలో 7-10 శాతం కమీషన్ ఇవ్వనిదే బిల్లులు సెటిల్ కావట్లేదన్నారు.