News April 29, 2024
‘మా కరోనా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్’.. ఫార్మా కంపెనీ అంగీకారం
తమ కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా కంపెనీ తొలిసారిగా అంగీకరించింది. వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యాయని యూకేలో పలువురు కోర్టుకెక్కారు. రక్తం గడ్డకట్టడంతో పాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ‘అరుదైన సందర్భాల్లో ఇలా జరగొచ్చు’ అని ఆస్ట్రాజెనెకా కోర్టుకు తెలిపింది. ఈ కంపెనీ ‘కొవిషీల్డ్’ పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లు విక్రయించింది.
Similar News
News November 10, 2024
సౌదీ అరేబియాలో మెట్రో లోకో పైలట్‌గా తెలుగు మహిళ
HYD మెట్రో రైలు లోకో పైలట్ ఇందిర(33) అరుదైన ఘనత అందుకోనున్నారు. వచ్చే ఏడాది సౌదీలోని రియాద్‌లో ప్రారంభమయ్యే ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో సేవలు అందించనున్నారు. రైళ్లను నడపడం, స్టేషన్ల ఆపరేటింగ్‌లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మెట్రో ప్రాజెక్టుకు ఎంపిక చేసి ఐదేళ్ల పాటు శిక్షణ అందించారు. ఇప్పటికే ఆమె ట్రయల్ రైళ్లను నడుపుతున్నారు. తెలుగు బిడ్డగా ఈ ప్రాజెక్టులో భాగమవ్వడం గర్వంగా ఉందని ఇందిర చెప్పారు.
News November 10, 2024
సౌతాఫ్రికా టార్గెట్ 125
SAతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్లు శాంసన్ (0), అభిషేక్ శర్మ (4)తో పాటు సూర్య (4), రింకూ సింగ్ (9) ఫెయిల్ అయ్యారు. తిలక్ 20, అక్షర్ 27, హార్దిక్ 39* రన్స్ చేశారు.
News November 10, 2024
రాజస్థాన్‌లో కాలేజీలకు కాషాయ రంగులు.. కాంగ్రెస్ విమర్శలు
కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.