News August 22, 2024

ఒత్తిడి వల్లే కాళేశ్వరం ఫైల్స్‌పై సంతకాలు: నరేందర్

image

TG: KCR, హరీశ్‌రావు ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్‌ల ఫైనల్ అప్రూవల్‌కు తాను సంతకాలు చేసినట్లు సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ‘ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే తప్పులు జరిగాయి. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ సరిగా చెక్ చేయలేదు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవోతో పాటు ఎల్అండ్‌టీ సంస్థ పాల్గొంది’ అని చెప్పారు.

Similar News

News January 19, 2026

విశాఖ: టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతం

image

జీవీఎంసీ 86వ వార్డు TDPలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. NTR వర్ధంతి సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఒక వర్గంగా, వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ మరో వర్గంగా విడిపోయి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మద్దతుతో వార్డు అధ్యక్షుడు తన పట్టును పెంచుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 19, 2026

రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,910 పెరిగి రూ.1,45,690కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.1,750 పెరిగి రూ.1,33,550 పలుకుతోంది. అటు వెండి భగభగలు తగ్గడం లేదు. కేజీ సిల్వర్ రూ.8,000 పెరిగి రూ.3,18,000కు చేరింది.

News January 19, 2026

Photo Gallery: మేడారంలో CM కుటుంబం, మంత్రులు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఇటీవల నిర్మించిన నూతన గద్దెలను పున:ప్రారంభించారు. అనంతరం మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించారు. సీఎం సతీమణి, కూతురు, అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.