News June 21, 2024

గణనీయంగా పెరిగిన దుర్గగుడి రోజువారీ ఆదాయం: ఈవో

image

AP: విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి రోజువారీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగిందని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 16 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా రూ.3,23,75,523 లభించినట్లు తెలిపారు. సగటున రోజుకు రూ.20,23,470లు కానుకల రూపంలో వచ్చాయని పేర్కొన్నారు. బంగారం 694 గ్రాములు, వెండి 6కిలోల 264 గ్రాములు వచ్చాయన్నారు. ఆన్‌లైన్ ఈ హుండీ ద్వారా రూ.59,380ల ఆదాయం సమకూరినట్లు చెప్పారు.

Similar News

News March 17, 2026

సినిమా పైరసీ చేస్తే మూడేళ్ల జైలు!

image

TG: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపడుతోంది. మూవీ పైరసీ చేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ తప్పదని CSB డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి సంయుక్తంగా యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News March 17, 2026

పెరగనున్న కార్ల ధరలు!

image

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.

News March 17, 2026

‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. స్పందించిన డైరెక్టర్

image

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ <<19398040>>పేరును<<>> ‘మాతృభూమి’గా మార్చడం తెలిసిందే. దీనిపై మూవీ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్పందించారు. ‘ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ముందుగానే 2 టైటిల్స్ నమోదు చేసుకున్నాం. మానవత్వం, సానుభూతి, మన సైనికుల నిశ్శబ్ద పోరాటాల గురించి మూవీ తెలియజేస్తుంది. కొత్త టైటిల్ చిత్రంలోని భావోద్వేగాన్ని మరింత ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.