News June 18, 2024

సిక్కోలు ప్రజల కల నిజమైంది: రామ్మోహన్ నాయుడు

image

AP: తాను కేంద్ర మంత్రి కావడంతో సిక్కోలు ప్రజల కల నిజమైందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో ఆయన మాట్లాడారు. కష్టనష్టాల్లో జిల్లా ప్రజలు తనకు అండగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News November 23, 2025

GHMCకి ఇదే ఆఖరు.. ఏం జరుగుతుందో?

image

GHMC పాలక మండలి సమావేశం ఈ నెల 25న జరుగనుంది. పాలకమండలి గడువు త్వరలో ముగియనుండటంతో ఇదే చివరి సర్వసభ్య సమావేశం అని తెలుస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏమేం అంశాలపై మాట్లాడాలో అజెండా తయారు చేసుకుంటున్నారు. ఈలలు, కేకల మధ్య సభ్యులందరితో ఫొటో సెషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే సభ్యులందరికీ సమాచారం అందింది. మరి సమావేశం వాడి.. వేడిగా జరుగుతుందా.. లేక ఆహ్లాద వాతావరణం నెలకొంటుందా అనేది చూడాలి.

News November 23, 2025

ముత్తుసామి సూపర్ సెంచరీ

image

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అదుర్స్ అనిపించారు. ఇది అతడికి తొలి టెస్ట్ సెంచరీ. మార్కో జాన్సన్(49*) సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. INDకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇండియన్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం RSA స్కోర్ 418/7గా ఉంది.

News November 23, 2025

672 Sr రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిమ్స్ న్యూఢిల్లీ 672 Sr రెసిడెంట్/Sr డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి MBBS, DNB/MD/MS/PhD/MSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష DEC 13న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.aiimsexams.ac.in/