News April 28, 2024
రెండు రాష్ట్రాల మధ్య సారూప్యతలు ఇవే: పూనమ్ కౌర్

ఏపీని యూపీగా పేర్కొన్న నటి పూనమ్ కౌర్ <<13132166>>మరో<<>> ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో మహిళల సమస్యలు, నేరాలు, నీటి సంక్షోభం విషయంలో సారూప్యతలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. వీటి పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం సంక్షోభానికి కారణమైందన్నారు. ఏపీ భవిష్యత్తును నిర్ధారించడానికి ప్రభుత్వం, పౌర సమాజం కలిసి రావాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు.
Similar News
News April 18, 2026
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

* 1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
* 1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
* 1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
* 1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
* 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం(ఫొటోలో)
* 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
* ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 18, 2026
అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేస్తుంది: ట్రంప్

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తాము స్తంభింపజేసిన నిధులను ఆ దేశానికి ఇవ్వబోమని స్పష్టంచేశారు. ‘యురేనియం శుద్ధిని ఆపేస్తామని ఇరాన్ తెలిపింది. రెండు దేశాల మధ్య చాలా కీలక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వారాంతంలోనే శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి’ అని ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు.
News April 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


