News November 3, 2024

RC16 షూటింగ్ ఎప్పటి నుంచంటే?

image

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. మైసూరులో షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Similar News

News December 6, 2025

NTR: వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు

image

KRU పరిధిలోని కళాశాలలలో పీజీ కోర్సులలో వేకెంట్ సీట్ల భర్తీకై ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్‌ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని వర్సిటీ డైరెక్టర్ డా.ఎల్. సుశీల తెలిపారు. ఏపీ పీజీసెట్-2025 రాసి క్వాలిఫై కానివారు, ఆ పరీక్ష రాయనివారు స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చని, ప్రభుత్వ నిబంధనల మేరకు వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదన్నారు. DEC 8న ఉదయం 10 గంటలకు KRU క్యాంపస్‌లో సంప్రదించాలన్నారు.

News December 6, 2025

వంటింటి చిట్కాలు

image

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.

News December 6, 2025

7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

image

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.