News January 18, 2025
నిరాశపరిచిన సింధు

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా మారస్కా 9-21, 21-19, 17-21 పాయింట్ల తేడాతో సింధును ఓడించారు. తొలి రౌండ్‌లో పూర్తిగా తేలిపోయిన ఈ తెలుగు షట్లర్ రెండో రౌండ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా మూడో రౌండ్లో నిరాశపరిచారు. మరోవైపు మెన్స్ డబుల్స్ జోడీ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
Similar News
News December 6, 2025
ఫిట్‌నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్‌కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్‌నెస్ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.
News December 6, 2025
‘రీపర్ హార్వెస్టర్’తో పంట కోత మరింత సులభం

వ్యవసాయంలో యాంత్రీకరణ అన్నదాతకు ఎంతో మేలు చేస్తోంది. పంట కోత సమయంలో కూలీల కొరతను అధిగమించడానికి మార్కెట్‌లో అనేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘రీపర్ హార్వెస్టర్’. ఈ యంత్రంతో వరి, గోధుమ, సోయాబీన్ ఇతర ధాన్యాల పంటలను సులభంగా కోయవచ్చు. డైరీ ఫామ్ నిర్వాహకులు కూడా సూపర్ నేపియర్ గడ్డిని కట్ చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. వీటిలో కొన్ని ధాన్యాన్ని కోసి కట్టలుగా కూడా కడతాయి.
News December 6, 2025
పంచాయతీ పోరు.. ఖర్చుల లెక్క చెప్పకుంటే అనర్హత వేటు

TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ఫలితాల తర్వాత 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలను ECకి తప్పనిసరిగా సమర్పించాలి. లేదంటే అనర్హత వేటు పడుతుంది. వేటు పడితే మూడేళ్లపాటు ఏ ఎన్నికలో పోటీ చేయరాదు. గెలిచిన వారు లెక్కలు చెప్పకపోతే పదవి నుంచి తొలగిస్తారు. 5 వేలకు పైగా ఓటర్లు ఉన్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు ₹2.50L, వార్డ్ మెంబర్లు ₹50K వరకు ఖర్చు చేయవచ్చు


