News August 12, 2024
వచ్చే ఒలింపిక్స్‌లో సింధు.. సైనా నెహ్వాల్ ఏమన్నారంటే?
బ్యాడ్మింటన్ స్టార్ సింధు వచ్చే ఒలింపిక్స్(2028)లో ఆడటంపై మాజీ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్‌లో ఆడాలని సింధుకు కోరికగా ఉంటే సరిపోదు. ఆమె వయసు పెరిగే కొద్ది శరీరం ఎలా సహకరిస్తుందనేది ముఖ్యం. ఒకవేళ సహకరిస్తే ఎంతకాలమైనా కొనసాగవచ్చు. పారిస్ ఒలింపిక్స్‌లో సింధు బాగానే ఆడినా ప్రత్యర్థి బింగ్జియావో ఆమె కన్నా మెరుగ్గా ఆడారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Similar News
News September 15, 2024
అల్లు అర్జున్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఓ బహుమతి పంపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని బన్నీ వెల్లడించారు. ‘ఎవరో తెలీదు కానీ నాకు ఈ పుస్తకాన్ని గిఫ్ట్‌గా పంపించారు. అతడి నిజాయితీ నా హృదయాన్ని తాకింది. నాకు పుస్తకాలంటే ఇష్టం. ఇక ఈ బుక్ రాసిన సీకే ఒబెరాన్‌కు ఆల్ ది బెస్ట్’ అని ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. దీంతో ఆ అభిమాని ఎవరా అంటూ ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News September 15, 2024
రేవంత్.. నీ గుండెల్లో నిద్రపోతా: హరీశ్
TG: రుణమాఫీ అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదలిపెట్టనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తాను ఎక్కడా దాక్కోలేదని, అనుక్షణం రుణమాఫీని గుర్తు చేస్తూ మిగతాది చేసే వరకు గుండెల్లో నిద్రపోతానని చెప్పారు. వడ్లకు బోనస్ ఇస్తానని బోగస్‌గా మార్చిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే పూర్తిగా రుణమాఫీ జరగలేదని, దీనిపై చర్చకు సిద్ధమా అని రేవంత్‌కు సవాల్ విసిరారు.
News September 15, 2024
రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.