News March 30, 2025
సింగరేణి రికార్డ్.. ఒకే రోజు 3.25L టన్నుల బొగ్గు రవాణా

TG: సింగరేణి గనుల నుంచి ఈ నెల 28న 3.25 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. 136 ఏళ్ల చరిత్రలో ఇదొక రికార్డని పేర్కొన్నారు. అధికారులు, కార్మికుల కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఇలాగే బొగ్గు ఉత్పత్తి చేస్తామన్నారు.
Similar News
News April 17, 2025
మేము హిందూస్ కానీ.. హిందీస్ కాదు: రాజ్ ఠాక్రే

జాతీయ భాష కాని హిందీని ప్రాథమిక తరగతిలోనే నేర్చుకోవాల్సిన అవసరమేముందని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్రలో NEPని అమలు చేయడాన్ని సహించేది లేదని ట్వీట్ చేశారు. తామంతా ‘హిందూస్ కానీ.. హిందీస్ కాదు’ అన్నారు. NEPని అమలు చేస్తే పోరాటం జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. మరాఠీ, నాన్ మరాఠీ ప్రజల మధ్య గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందుదామని భావిస్తుందని ఆయన ఆరోపించారు.
News April 17, 2025
వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
News April 17, 2025
గిట్టుబాటు ధర లేదు.. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించట్లేదు: బొత్స

AP: కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని, ఉపాధి కూలీలకూ డబ్బులు చెల్లించట్లేదని ఫైరయ్యారు. 10 నెలల్లో ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.