News March 6, 2025
‘హిజాబ్’పై పాట.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు

ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన సింగర్ మోహదీ యర్రాహికి కోర్టు 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. 2023లో అరెస్టయిన అతను గత ఏడాది విడుదలయ్యారు. తాజాగా ‘కొరడా’ శిక్షపై సింగర్ స్పందిస్తూ ‘మూల్యం చెల్లించడానికి ఇష్టపడని వ్యక్తి స్వేచ్ఛకు అర్హుడు కాదు. నేను అందుకు సిద్ధమే’ అని పేర్కొన్నారు. బహిరంగప్రదేశాల్లో హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ 2022లో మహిళలు ఉద్యమం చేయగా ప్రభుత్వం అణచివేసింది.
Similar News
News March 25, 2025
రేపు వైసీపీ ఇఫ్తార్ విందు

AP: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.
News March 25, 2025
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

TG: రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ 3 నుంచి 4 ఎకరాల్లోపు అన్నదాతల ఖాతాల్లో రూ.200 కోట్ల డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లు రిలీజ్ చేసినట్లయ్యింది. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4,666.57 కోట్లు అందించింది. ఈ నెలాఖరులోపు రైతులందరి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
News March 25, 2025
శ్రేయస్ తన సెంచరీ కోసం చూడొద్దని చెప్పారు: శశాంక్

GTతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97*) సెంచరీ మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే మరో ఎండ్‌లో శశాంక్ హిట్టింగ్ చేయడంతో అయ్యర్‌కు స్ట్రైక్ రాలేదు. ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ దీనిపై మాట్లాడుతూ.. ‘నా సెంచరీ కోసం చూడొద్దు. నువ్వు షాట్లు ఆడు’ అని శ్రేయస్ తనతో చెప్పారన్నారు. తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించిన కెప్టెన్ అయ్యర్‌ను ఫ్యాన్స్ పొగుడుతున్నారు.