News March 15, 2025
నేటి నుంచి ఒంటిపూట బడులు.. మ.12.30 గంటల వరకే స్కూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉ.8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మ.1:00 నుంచి సా.5:00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక ఏపీలో ఉ.7:45 నుంచి మ.12:30 బడులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మ.1:15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయి.
Similar News
News December 15, 2025
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.
News December 15, 2025
యువ సత్తా.. 22 ఏళ్లకే సర్పంచ్

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. కామారెడ్డిలో కళ్యాణి గ్రామ సర్పంచ్గా 22 ఏళ్ల నవ్య(Left) ఎన్నికయ్యారు. నవ్యకు 901 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి రత్నమాలకు 317 ఓట్లు వచ్చాయి. దీంతో 584 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. భూపాలపల్లిలోని దుబ్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి అంజలి(23-Right) గెలుపొందారు. ప్రత్యర్థిపై 41 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు.
News December 15, 2025
AFCAT-2026 దరఖాస్తు గడువు పొడిగింపు

ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-1/2026) దరఖాస్తు గడువును DEC 19వరకు పొడిగించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ లేదా బీఈ, బీటెక్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-26ఏళ్లు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్లో ₹56,100, ఆ తర్వాత ₹1,77,500 వరకు జీతం ఉంటుంది. వెబ్సైట్: https://afcat.cdac.in/


