News February 15, 2025

సిన్నర్‌పై డోపింగ్ ఆరోపణలు.. మూడు నెలలు నిషేధం

image

మెన్స్ టెన్నిస్ నం.1 ప్లేయర్ జన్నిక్ సిన్నర్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్‌లో పట్టుబడ్డ అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. ఫిజియోథెరపీ సమయంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్లిందని సిన్నర్ ఆంగీకరించారు. WADA కూడా సిన్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి మోసం చేయలేదని పేర్కొంది. అయినా FEB 9- మే 4 వరకు నిషేధం అమల్లో ఉంటుందంది. కాగా ఇటీవల సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు.

Similar News

News July 9, 2025

యువీ ‘లక్ష్యం’ కోసం కదలిన తారలు

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఛారిటీ ‘YouWeCan’ కోసం క్రికెట్ సెలబ్రిటీలు తరలివచ్చారు. లండన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్, కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా క్యాన్సర్ రోగుల కోసం యువీ సామాజిక సేవ చేస్తున్న విషయం తెలిసిందే.

News July 9, 2025

APలో భారీ పెట్టుబడి: TDP

image

AP: దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ రాష్ట్రంలో పెట్టేందుకు Syrma SGS Technology ముందుకొచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద రూ.1800 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని, 2027 మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, చంద్రబాబు, లోకేశ్ కృషి ఫలించిందని వివరించింది.

News July 9, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

image

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్‌ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.