News May 24, 2024
‘సార్.. ఎక్కడ తినమంటారు? నటుడు బ్రహ్మాజీ ప్రశ్న

HYDలో పేరొందిన చాలా రెస్టారెంట్లు, కేఫ్‌లలో చెడిపోయిన, కల్తీ, నిల్వ ఆహారం, కాలం చెల్లిన వస్తువులను వాడుతున్నట్లు, అపరిశుభ్రతను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల తనిఖీల్లో గుర్తించారు. దీనిపై స్పందించిన నటుడు బ్రహ్మాజీ.. ‘సార్.. మరి ఎక్కడ తినమంటారు? ఇంట్లోనా?’ అని ప్రశ్నించారు. అటు భారీగా బిల్లులు వసూలు చేసే రెస్టారెంట్లు క్వాలిటీ ఫుడ్ ఇవ్వకపోతే ఎలా అని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు.
Similar News
News July 5, 2025
ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్‌మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)
News July 5, 2025
భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
News July 5, 2025
DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?