News January 7, 2025

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిరాజ్‌కు రెస్ట్!

image

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు పేసర్ సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని BCCI భావిస్తోంది. 2023 నుంచి 671.5 ఓవర్ల బౌలింగ్ వేసిన అతనిపై పనిభారం తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే T20లకు రెస్ట్ ఇచ్చి వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. BGTలో ఆశించిన మేర రాణించకలేకపోయినా కీలక సమయాల్లో సిరాజ్ వికెట్లు తీశారు. JAN 22-FEB 2వరకు 5 T20లు జరగనున్నాయి.

Similar News

News April 13, 2026

అసమగ్ర డేటాతో డీలిమిటేషన్ వద్దు: సోనియా

image

లోక్‌సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. 2027 జనగణనకు ముందే అసమగ్ర డేటా ఆధారంగా డీలిమిటేషన్‌‌ను చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లును ఏప్రిల్ 16-18 మధ్య కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.

News April 13, 2026

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి అంటూ BRS చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ పార్టీ SMలో చేస్తున్న దుష్ప్రచారానికి KCRదే బాధ్యతని సీతక్క పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. 48 గంటల్లో ఆ పోస్టులను తొలగించి KCR క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

News April 13, 2026

TGTET-2026 నోటిఫికేషన్ విడుదల

image

TGTET-2026కు ఈ నెల 15-30 మధ్య <>వెబ్‌సైట్‌లో<<>> దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 9 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అదే నెల 15-30 మధ్య ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉ.9-11.30, మ.2 గంటల నుంచి సా.4.30 గంటల వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. జులై 28-31 మధ్య ఫలితాలు వెల్లడిస్తారు. Gen, BCలకు ఒక పేపరుకు ₹.750, 2 పేపర్లకు ₹1000, SC, ST, PwD అభ్యర్థులకు ఒక పేపరుకు ₹700, 2 పేపర్లకు ₹950గా ఫీజు నిర్ణయించారు.