News August 21, 2024
అక్టోబర్ 15న సిరిమానోత్సవం

AP: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 15న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి దీక్షల విరమణ ఉంటుంది. రాష్ట్ర పండుగగా గుర్తించడంతో అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. OCT 30న వనంగుడిలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయి.
Similar News
News November 8, 2025
ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను ప్రారంభించిన చైనా

చైనా తమ మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. బుధవారం చైనాలోని సాన్యా పోర్టులో అధ్యక్షుడు జిన్ పింగ్ దీనిని ప్రారంభించినట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘జిన్హువా’ పేర్కొంది. కానీ, అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొంది. చైనా తీసుకొచ్చిన లియావోనింగ్(2012), షాన్డాంగ్(2019) కంటే ఇది పెద్దదని, దీని బరువు 80 వేల టన్నులని తెలుస్తోంది.
News November 8, 2025
పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి పైలట్‌ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
News November 8, 2025
సంకటహర గణపతి వ్రతం ఎలా చేయాలంటే..?

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. గణపతి పూజ చేసి, ఎర్ర గుడ్డలో పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూరం, వక్కలు, దక్షిణ వేసి ముడుపు కట్టి, కోరిక మనసులో అనుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం, మౌనంగా ఉంటూ గణపతిని కొలవాలి. సాయంత్రం దీపాలు పెట్టాలి. ముడుపు బియ్యంతో బెల్లం పాయసం, ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టాలి. వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు కూడా మద్యమాంసాలు ముట్టొద్దు. మరుసటి రోజు హోమం చేస్తే శుభం.


