News August 21, 2024
అక్టోబర్ 15న సిరిమానోత్సవం
AP: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 15న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి దీక్షల విరమణ ఉంటుంది. రాష్ట్ర పండుగగా గుర్తించడంతో అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. OCT 30న వనంగుడిలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయి.
Similar News
News September 14, 2024
INSPIRATION: ఒకప్పుడు గిన్నెలు కడిగి.. ఇప్పుడు ఎమ్మీ హోస్ట్‌గా..
ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌ను హోస్ట్ చేయనున్న ఫస్ట్ ఇండియన్‌గా అవతరించారు. డెహ్రాడూన్‌లో పుట్టిన వీర్ దాస్ USలో చదివేటప్పుడు ఖర్చుల కోసం వీధుల్లో గిటార్ వాయించేవారు. డిష్ వాషర్, డోర్మ్యాన్గానూ చేశారు. డబ్బుల్లేక ATM సెంటర్ల ముందు నిల్చొని కన్నీళ్లు పెట్టుకునేవారు. దాదాపు 20ఏళ్లకు ఎమ్మీ అవార్డ్స్‌ను హోస్ట్ ఛాన్స్ కొట్టేసి నిజమైన టాలెంట్‌ను ఎవరూ ఆపలేరని నిరూపించారు.
News September 14, 2024
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.440 పెరిగి రూ.74,890కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.68,650 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.2,000 పెరిగి రూ.97వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 14, 2024
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
APలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, MPTCలకు ఇవ్వాలన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు వరదలతో ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ CM పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.