News May 19, 2024

హింసాత్మక ఘటనలపై సిట్ క్షేత్రస్థాయి విచారణ

image

AP: ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. పల్నాడు(D)లోని పలు ప్రాంతాలు, అనంతపురం(D) తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనల్లో నిందితులను గుర్తిస్తోంది. ఇప్పటికే పలు ఆధారాలను సిట్ సేకరించింది. అల్లర్లతో సంబంధం ఉన్న రాజకీయ నేతలను అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 2, 2024

గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు: హెడ్ ప్రశంసలు

image

AUS స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ IND స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. BGT తొలి టెస్టులో 89 పరుగులు చేసిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేయగా అప్పటి నుంచి దీనిపై ఆయన స్పందించలేదు. తాజాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హెడ్ స్పందిస్తూ.. ‘నేను ఆడిన గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నానని నా మనవళ్లతో చెప్పడం కూడా బాగుంటుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

News December 2, 2024

పదవులపై ఆశ లేదు: శిండే కుమారుడు

image

తాను డిప్యూటీ సీఎం అవుతాననే ప్రచారంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే కుమారుడు శ్రీకాంత్ శిండే స్పందించారు. ఆ రేసులో లేనని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ వచ్చినా తీసుకోలేదు. పార్టీ కోసం పనిచేయడానికే కట్టుబడి ఉన్నా’ అని శ్రీకాంత్ వెల్లడించారు.

News December 2, 2024

ఎల్లుండి పెళ్లి.. ప్రీవెడ్డింగ్ ఫొటోలు చూశారా?

image

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పెళ్లికి ముందు తంతు ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. తాజాగా శోభితను పెళ్లి కూతురు చేయగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నిర్వాహకులు షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో ఎల్లుండి వివాహం జరగనుంది.