News April 23, 2025
రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారుల పిటిషన్

AP: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. రూ.3200 కోట్ల కమీషన్ల అంశంలో అతడు కీలక నిందితుడని, విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని తెలిపారు. డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకొని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న కారణంగా వారంపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
Similar News
News August 9, 2025
ట్రంప్, పుతిన్ భేటీ.. స్వాగతించిన భారత్

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ ఈ నెల 15న అలాస్కాలో భేటీ కానున్న విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘US, రష్యన్ ఫెడరేషన్ అలాస్కాలో సమావేశమయ్యేందుకు ముందుకు రావడాన్ని ఇండియా స్వాగతిస్తోంది. ఈ భేటీతో యుద్ధానికి తెరపడి ఉక్రెయిన్‌లో శాంతికి దారులు తెరుచుకునే అవకాశం ఉంది. ఇది యుద్ధాల యుగం కాదని PM మోదీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.
News August 9, 2025
నిర్మాతలతో కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలం

వేతనాల పెంపుపై <<17354311>>నిర్మాతలతో<<>> కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని, 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. ఫెడరేషన్‌ను విభజించేలా నిర్మాతల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పారు.
News August 9, 2025
పులివెందులలో గతంలో ఆ పరిస్థితి లేదు: ప్రత్తిపాటి

AP: ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో గతంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని చెప్పారు. రౌడీ ముఠాలను తరిమేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కడప(D) ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలిపారు. ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.