News April 23, 2025

రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారుల పిటిషన్

image

AP: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. రూ.3200 కోట్ల కమీషన్ల అంశంలో అతడు కీలక నిందితుడని, విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని తెలిపారు. డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకొని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న కారణంగా వారంపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

Similar News

News April 16, 2026

సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా

image

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ ప్రకటించారు. అయితే ఆయనకు గాయాలయ్యాయని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ తమతో డీల్ చేసుకోకుంటే మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

News April 16, 2026

ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

image

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.

News April 16, 2026

బెంగాల్ ‘మాజీ ఓటర్ల’కు రిలీఫ్?

image

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ SIRతో ఓట్లు కోల్పోయిన వారికి ఊరట లభించే అవకాశం ఉంది. ఎన్నికల జాబితాలో పేరు చేర్చేందుకు అప్పీలేట్ ట్రైబ్యునల్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న వారు ఓటు వేయొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే ఈ క్లియరెన్స్ వచ్చి జాబితాలో లిస్ట్ అయ్యి ఉండాలని స్పష్టం చేసింది. కాగా SIRతో బెంగాల్‌లో దాదాపు 91లక్షల ఓట్లు పోయాయి.