News May 20, 2024

అల్లర్లపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్

image

ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. డీజీపీకి నివేదికను అందించనున్నట్లు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. పలు కేసుల్లో సెక్షన్లను అదనంగా చేరుస్తున్నామని, మరి కొంతమంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఇవాళ డీజీపీ ఆఫీసు నుంచి తెలియజేస్తామని చెప్పారు. నిన్న నరసరావుపేట, చంద్రగిరి, తిరుపతిలో సిట్ విచారణ జరిపింది.

Similar News

News December 31, 2025

రేపు పబ్లిక్ హాలిడే లేదు.. అయినా..

image

జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు. ఏపీ, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది. అయినా చాలా వరకు ప్రైవేట్ స్కూళ్లు రేపు సెలవు ప్రకటించాయి. దీనికి బదులు ఫిబ్రవరిలో రెండో శనివారం పాఠశాలలు పని చేస్తాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. అటు బ్యాంకులకు సైతం రేపు సెలవు లేదు. యథావిధిగా నడుస్తాయి.

News December 31, 2025

పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. 22 మరణాలు

image

APలో <<18469690>>స్క్రబ్ టైఫస్<<>> కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 2 వేలకుపైగా కేసులు నమోదు కాగా 22మంది మరణించారు. గత మూడేళ్లుగా చిత్తూరు(D)లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది చిత్తూరులో అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, విశాఖ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శరీరంపై నల్లమచ్చతోపాటు జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 31, 2025

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా?

image

మహిళల గర్భాశయంలో ఏర్పడే గడ్డలనే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి రకరకాల పరిమాణాల్లో ఏర్పడతాయి. ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడడం మూలంగా మూత్రసంబంధ సమస్యలు వస్తాయి. ✍️ ఫైబ్రాయిడ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.