News May 20, 2024
అల్లర్లపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్
ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. డీజీపీకి నివేదికను అందించనున్నట్లు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. పలు కేసుల్లో సెక్షన్లను అదనంగా చేరుస్తున్నామని, మరి కొంతమంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఇవాళ డీజీపీ ఆఫీసు నుంచి తెలియజేస్తామని చెప్పారు. నిన్న నరసరావుపేట, చంద్రగిరి, తిరుపతిలో సిట్ విచారణ జరిపింది.
Similar News
News December 2, 2024
KCR కంటే దారుణంగా రేవంత్ రెడ్డి పాలన: ఈటల
TG: కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసనలకు పిలుపునిచ్చామని BJP MP ఈటల రాజేందర్ అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ బాధితుల వివరాలు సేకరిస్తామని చెప్పారు. KCR కంటే రేవంత్ పాలన దారుణంగా ఉందని ఆరోపించారు. ఏడాది పాలనలో మోసాలు, దగా తప్ప ఏమీలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, PM మోదీ తమకు హామీ ఇచ్చారని చెప్పారు. ఈ నెల 7న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ సభ ఉంటుందని, జాతీయ నేతలు హాజరవుతారన్నారు.
News December 2, 2024
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
AP: నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. వీటితోపాటు కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. అర్హులకు సంక్రాంతి నుంచి కొత్త కార్డులు అందించనుంది. జగన్ బొమ్మ ఉన్న రేషన్ కార్డులకు బదులు కొత్తవాటిని ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పౌరసరఫరాలశాఖ అధికారికి వెబ్‌సైట్‌లోనూ అప్లై చేసుకోవచ్చు.
News December 2, 2024
జగన్ ఆస్తుల కేసులపై సుప్రీం కీలక ఆదేశం
ఏపీ మాజీ CM జగన్ ఆస్తులపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను వివరించాలంది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్ట్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.