News April 9, 2024

గాజాలో పరిస్థితులు ఆందోళనకరం: భారత్

image

గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభం ఆందోళన కలిగిస్తోందని UNOలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలు, చిన్నారులు వేల సంఖ్యలో మరణించారని.. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. సామాన్య పౌరులను బందీలుగా చేసుకోవడాన్ని ఏమాత్రం సమర్థించమని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు మానవతా సాయాన్ని పెంచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Similar News

News January 10, 2025

20 కోచ్‌లతో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11 నుంచి 20 కోచ్‌లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చెయిర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌లో 16 కోచ్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ ఉ.5.45 గంటలకు విశాఖ నుంచి, మ.3 గం.కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.

News January 10, 2025

ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలి: సీఎం

image

TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 10, 2025

‘సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం

image

TG: ‘సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై TGSRTC ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.