News August 11, 2025
‘కూలీ’లో శివకార్తీకేయన్?

లోకేశ్ కనగరాజ్ సినిమాలు అనగానే యాక్షన్‌తో పాటు సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రజినీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘కూలీ’లోనూ ఇలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రజినీ యంగ్ రోల్‌లో ‘అమరన్’ ఫేమ్ శివకార్తీకేయన్ కనిపిస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. లోకీ స్టైల్‌లో మాస్ రోల్‌లో ఈ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఈ నెల 14న సినిమా విడుదలయ్యాకే దీనిపై క్లారిటీ రానుంది.
Similar News
News August 11, 2025
రూ.100 కోట్లు దాటిన ‘కింగ్డమ్’ కలెక్షన్లు!

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. విడుదలైన 10 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని తెలిపాయి. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. పార్ట్-2 కూడా ఉందని మూవీ యూనిట్ ప్రకటించింది.
News August 11, 2025
భారత్‌లో వరల్డ్ కప్.. కౌంట్‌డౌన్ స్టార్ట్

భారత్‌లో మరో క్రికెట్ సంగ్రామానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. Sept 30న మొదలయ్యే మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి మరో 50 రోజులే ఉండటంతో నేడు ICC ట్రోఫీ టూర్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ICC ఛైర్మన్ జై షా, BCCI సెక్రటరీ సైకియా, మాజీ స్టార్లు యువరాజ్, మిథాలీ రాజ్, మహిళా క్రికెటర్లు హర్మన్, స్మృతి, జెమీమా పాల్గొన్నారు. కాగా టోర్నీకి అతిథ్యమివ్వనున్న అన్ని నగరాల్లో ట్రోఫీ టూర్ నిర్వహించనున్నారు.
News August 11, 2025
హార్ట్ అటాక్.. పదేళ్ల ముందే పసిగట్టొచ్చు!

భవిష్యత్‌లో వచ్చే గుండె సమస్యలను పదేళ్ల ముందే పసిగట్టొచ్చని ‘JAMA కార్డియాలజీ’లో పబ్లిషైన అధ్యయనం చెబుతోంది. ‘ఒక్కసారిగా ఒంట్లో శక్తి తగ్గడం, తక్కువగా కదలడం, ఎక్కువగా నిద్రపోవడం వంటి లక్షణాలు పదేళ్ల తర్వాత వచ్చే గుండె జబ్బులకు సంకేతాలు. బాడీలో కొలెస్ట్రాల్, BP స్థాయులు పెరగడానికి ముందే వీటి ద్వారా జాగ్రత్త పడొచ్చు’ అని వివరిస్తోంది. ఊరికే కూర్చోకుండా ఎక్కువగా కదలడం అలవాటు చేసుకోవాలని సూచిస్తోంది.