News August 11, 2025
‘కూలీ’లో శివకార్తీకేయన్?

లోకేశ్ కనగరాజ్ సినిమాలు అనగానే యాక్షన్‌తో పాటు సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రజినీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘కూలీ’లోనూ ఇలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రజినీ యంగ్ రోల్‌లో ‘అమరన్’ ఫేమ్ శివకార్తీకేయన్ కనిపిస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. లోకీ స్టైల్‌లో మాస్ రోల్‌లో ఈ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఈ నెల 14న సినిమా విడుదలయ్యాకే దీనిపై క్లారిటీ రానుంది.
Similar News
News March 14, 2026
సిలిండర్ల బుకింగ్ మాటున సైబర్ కేటుగాళ్లు

TG: గ్యాస్ బుకింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘వారు పంపే APK ఫైళ్లను ఓపెన్ చేయొద్దు. సిలిండర్ తక్షణ డెలివరీ, ముందస్తు చెల్లింపులు అంటూ వచ్చే కాల్స్‌ను నమ్మొద్దు. బుకింగ్‌కు అధికారిక వెబ్సైట్లను వినియోగించాలి. లేదా ఏజెన్సీ వద్దకు వెళ్లాలి. మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలి. http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి’ అని సూచించారు.
News March 14, 2026
ఢిల్లీలో కట్టెల పొయ్యిపై నిషేధం ఎత్తివేత

గ్యాస్ కొరతతో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. దీంతో ప్రజలు వాటితో వంట చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది. దేశ రాజధానిలో తీవ్ర కాలుష్యం దృష్ట్యా కట్టెల పొయ్యిపై నిషేధం ఉండేది. ఎల్పీజీ సంక్షోభంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని, సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేయడం గమనార్హం.
News March 14, 2026
పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.


