News September 16, 2024
ఒక్క స్కూటీపై ఆరుగురు.. పిల్లల ప్రాణాలతో చెలగాటం!
వినాయక నిమజ్జనాలు చూపించేందుకు హైదరాబాద్‌లోని మొజాంజాహి మార్కెట్ వద్ద ఐదుగురు పిల్లలతో ఓ వ్యక్తి స్కూటీపై కనిపించారు. ఈక్రమంలో పిల్లల ప్రాణాలతో చెలగాటం అవసరమా? అని TGSRTC ఎండీ సజ్జనార్ ప్రశ్నించారు. ‘పిల్లలకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాల్సింది పోయి ప్రమాదకర రీతిలో వారిని ఇలా బైక్‌పై తీసుకెళ్లడం బాధాకరం. చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలకే ముప్పనే విషయం తెలియదా?’ అని ఫైరయ్యారు.
Similar News
News October 7, 2024
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్
టీ20ల్లో అత్యధిక మ్యాచులను సిక్సర్లతో ముగించిన భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్య నిలిచారు. బంగ్లాతో మ్యాచులో కోహ్లీ(4 మ్యాచులు) రికార్డును అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, పంత్ మూడేసి మ్యాచులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ జరిగిన T20 మ్యాచులో హార్దిక్ 39 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.
News October 7, 2024
బతుకమ్మకు అమెరికాలో అరుదైన గౌరవం
తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు ఈ పండుగను అధికారికంగా గుర్తించాయి. అంతే కాకుండా ఈ వారాన్ని హెరిటేజ్ వీక్‌గా ప్రకటిస్తూ ఆ రాష్ట్రాల గవర్నర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై అమెరికాలోని తెలంగాణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
News October 7, 2024
బీజేపీలో చేరిన పద్మశ్రీ గ్రహీత
పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిరిజన కళాకారిణి దుర్గాభాయ్ బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ విధానాలకు ఆకర్షితురాలై ఆమె కాషాయ పార్టీలో చేరినట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. స్వయంగా దుర్గాభాయ్ ఇంటికి వెళ్లిన సీఎం ఆమెకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. కాగా దుర్గాభాయ్ 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.