News August 5, 2024
షాద్‌నగర్ ఘటనలో ఆరుగురు పోలీసులు సస్పెండ్
TG: HYDలోని షాద్‌నగర్‌లో ఓ దళిత మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన <<13777846>>ఘటనపై<<>> పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన CM రేవంత్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ్యులు తప్పించుకోలేరన్నారు.
Similar News
News September 17, 2024
చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి
CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
నేనేమీ ఫామ్‌హౌస్ సీఎంను కాదు: రేవంత్
TG: ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి తానేమీ ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా ఎద్దేవా చేశారు.
News September 17, 2024
ఇన్వెస్టర్ల అప్రమత్తత.. రేంజుబౌండ్లో సూచీలు
బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. US ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. కొనుగోళ్లలో దూకుడు ప్రదర్శించడం లేదు. సెన్సెక్స్ 82,915 (-78), నిఫ్టీ 25,366 (-16) వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 25:25గా ఉంది. HDFC బ్యాంకు, ఎయిర్‌టెల్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. బ్రిటానియా, దివిస్ ల్యాబ్, LTIM, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్.