News December 3, 2024

SKLM: ఒకే పులి మూడున్నరేళ్లుగా సంచారం 

image

పాతపట్నం పరిధిలోని చోడసముద్ర ప్రాంతంలో ఇటీవల పులి సంచారం విషయం తెలిసిందే. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే పులి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఒడిశా ప్రాంతాల్లోని అడవుల్లో సంచరిస్తోందని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, సిబ్బంది గుర్తించారు. పులి అడుగుల జాడతో ఇదే పులి ఇక్కడ సంచరిస్తోందని నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Similar News

News November 14, 2025

నౌకా నిర్మాణ హబ్‌‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌: CM

image

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.

News November 14, 2025

SKLM: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తాం

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తామని ఏపీ మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. NSFC కింద 450 రుణాలుకు 3 వేల దరఖాస్తులందయాని ఆమె వివరించారు. రూ 1.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని త్వరలో ఎంపిక చేసి రుణాలు ఇస్తామన్నారు. అధికారులు గడ్డమ్మ సుజాత పాల్గొన్నారు.

News November 13, 2025

ఎచ్చెర్ల: ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్

image

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్.ఎం.పురం క్యాంపస్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి క్యాంపస్‌లో చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కుటుంబీకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది.