News September 8, 2024

SKLM: రేపు మీకోసం వినతుల స్వీకరణ కార్యక్రమం రద్దు

image

రేపు అనగా సెప్టెంబర్ 09, సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా వినతుల స్వీకరణ కార్యక్రమం రద్దు చేశామన్నారు.

Similar News

News December 14, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కేదెప్పుడు?

image

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News December 13, 2025

SKLM: ‘సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతల్లేకుండా చేయాలి’

image

సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులను గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్‌తో కలిసి ఆయన ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని అన్నారు.

News December 13, 2025

SKLM జిల్లాలో 6,508 కేసులు పరిష్కారం

image

జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌ ద్వారా 6,508 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా శనివారం పేర్కొన్నారు. దీనిలో సివిల్ కేసులు 202కు రూ.4,54,96,124లు, క్రిమినల్ కేసులు 625కు రూ.52,54,522లు, ఫ్రీ లిటిగేషన్ కేసులు 53కు రూ.20,38,931లతో రాజీ అయ్యాయని వెల్లడించారు. HMPO కేసులలో భార్యాభర్త కలుసుకోవడంతో న్యాయమూర్తులు ఆనందం వ్యక్తం చేశారన్నారు.