News January 27, 2025
SKLM: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: కలెక్టర్

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఆడపిల్లల తక్కువ జననాలు సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, హిరమండలం, సంతబొమ్మాళి మండలాల్లో నమోదవుతున్నాయని వెంటనే ఆయాచోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
Similar News
News October 23, 2025
నరసన్నపేట: నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన నరసన్నపేటలోని దేశవానిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన జనార్ధన్ (45) గత కొన్నేళ్లుగా మానసిక పరిస్థితి బాగులేదు. బుధవారం ఉదయం కనిపించకపోగా కుటుంబీకులు వెతికారు. సాయంత్రం నెలబావిలో శవమై తేలడంతో స్థానికులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదుతో ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.
News October 23, 2025
టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.