News March 30, 2026

SKLM: గల్ఫ్ యుద్ధం ఎఫెక్ట్ : భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

image

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సామాన్యుల వంటింటి బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరగ్గా.. వంట నూనెల ధరలు ఓవైపు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రకాల వంట నూనెలు లీటరు ప్యాకెట్లపై రూ.30 వరకు పెరిగాయి. ఇక కొన్ని రకాల నిత్యావసర ధరలు సైతం పెంచి వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నట్లు వినియోగదారులు తెలిపారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.