News April 1, 2026

SKLM: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌కు మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్’ పథకం కింద మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయి కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2, ఏప్రిల్ 4వ తేదీల్లో శ్రీకాకుళం DRDA కాంప్లెక్స్‌లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో జరుగుతుందన్నారు.18-25 ఏళ్ల వయస్సు గలవారు అర్హులన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.