News April 20, 2024

సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం: వీహెచ్

image

TG: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన నివాసంలో మౌన దీక్షకు దిగారు. తమ్ముడిగా భావించిన భట్టి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో రేవంత్ సీఎం అవుతారని మాట్లాడినందుకే తనపై కక్ష కట్టారన్నారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకు బయటి వారిని తీసుకొస్తున్నారని.. దీనిపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 25, 2026

రిపబ్లిక్ డే వేడుకల అతిథులు వీరే

image

EU నేతలు వాన్ డెర్, ఆంటోనియో (2026), ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో (2025), ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ (2024), ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ (2023), బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో (2020), SA ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా (2019), ASEAN లీడర్లు (2018), అబుదాబి ప్రిన్స్ షేక్ మొహమద్ బిన్ (2017), ప్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ (2016), US ప్రెసిడెంట్ ఒబామా (2015), 2021, 22లో కొవిడ్‌తో గెస్ట్‌లు రాలేదు.

News January 25, 2026

APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

image

చెన్నై అవడిలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<>AVNL<<>>) 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. వెబ్‌సైట్: https://avnl.co.in

News January 25, 2026

పూజలో రెట్టింపు ఫలితాలు పొందాలంటే..?

image

పూజా గది శుభ్రంగా ఉండాలి. పాత పూలు ఉండకూడదు. శివునికి విభూతి, విష్ణువుకు గంధం బొట్టు పెట్టి అలంకరించాలి. వెండి, రాగి కుందులు వాడాలి. 3 వత్తులు పెట్టాలి. ప్రమిదను పళ్లెంలో ఉంచి దీపారాధన చేయాలి. నైవేద్యాన్ని కుండ, లోహ పాత్రలో వండాలి. తమలపాకులో సమర్పించడం ఉత్తమం. హారతి ఇచ్చాక స్వామికి ఏకాంతం ఇవ్వాలి. అప్పుడాయన చూపు సోకి నైవేద్యం మహా ప్రసాదం అవుతుంది. ఈ నియమ నిష్ట పూజతో రెట్టింపు ఫలితముంటుంది.