News September 13, 2025

SLBC: ఇకపై DBM పద్ధతిలో తవ్వకం

image

TG: ఈ ఏడాది FEBలో SLBC టన్నెల్ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై టన్నెల్ బోరింగ్ మిషన్(TBM)తో తవ్వడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పనిని డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతి(DBM)లోనే చేపట్టనుంది. జలయజ్ఞంలో భాగంగా 2005లో SLBC సొరంగ మార్గం నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 నెలల్లో దీన్ని పూర్తిచేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరగగా ఇప్పటికి 20 ఏళ్లవుతున్నా పూర్తికాలేదు.

Similar News

News September 13, 2025

ఫేస్ టేపింగ్ చేస్తున్నారా?

image

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఖరీదైన బొటాక్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్తుంటే మరికొందరు ఫేస్ టేపింగ్ చేసుకుంటారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫేస్ టేపింగ్ ఎక్కువగా చేసుకుంటే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే చర్మం అందంగా, యవ్వనంగా మెరుస్తుందని సూచిస్తున్నారు.

News September 13, 2025

సుశీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.

News September 13, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,43,000గా ఉంది. రెండు రోజుల్లో కేజీ సిల్వర్‌పై రూ.3వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.