News February 26, 2025

SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు

image

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. BSF టన్నెల్ వర్క్స్ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రప్పించింది. ప్రస్తుతం వారు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీబీఎం చేరే దారి కోసం వారు వెతుకుతున్నారు. సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా ఉన్న బురదను తొలగించేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిపుణులతో సమీక్ష జరిపారు.

Similar News

News November 27, 2025

ఈ కంపెనీల అధిపతులు మనవాళ్లే!

image

ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే అధిపతులుగా ఉన్నారు. అందులో కొందరు.. ఆల్ఫాబెట్ Google- సుందర్ పిచాయ్, Microsoft-సత్య నాదెళ్ల, Youtube-నీల్ మోహన్, Adobe -శంతను నారాయణ్, IBM-అరవింద్ కృష్ణ, Novartis -వసంత్ నరసింహన్, Micron Technology- సంజయ్ మెహ్రోత్రా, Cognizant- రవి కుమార్, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్- రేష్మా కేవల్‌రమణి, Infosys-సలీల్ పరేఖ్, World Bank-అజయ్ బంగా.

News November 27, 2025

సొరకాయల కోత ఎప్పుడు చేపడితే మంచిది?

image

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్‌కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్‌కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.

News November 27, 2025

12 గంటల్లో తుఫాన్.. భారీ వర్షాలు: APSDMA

image

AP: సెన్యార్ తుఫాన్ <<18394233>>ముప్పు<<>> తప్పి 24 గంటలు గడవకముందే మరో తుఫాన్ కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 12 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఈనెల 29లేదా 30న ఉదయం నాటికి TN, దక్షిణ కోస్తా తీరానికి చేరుతుందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.