News September 18, 2024
తక్కువసేపు నిద్ర పోతున్నారా?
ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాం. తక్కువసేపు నిద్రపోతే మానసిక, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి క్షీణించటం, ఏకాగ్రత కోల్పోవడం, బరువు పెరగడం, కోపం ముంచుకురావడం, నిరుత్సాహం ఆవరించడం, పనితీరు తగ్గడం, డ్రైవింగ్‌లో ప్రమాదాలకు గురికావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం, ఒత్తిడి పెరగడం, గుండె సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోతే వీటి నుంచి తప్పించుకోవచ్చు.
Similar News
News October 4, 2024
ఈ నెల 14న హ్యుందాయ్ IPO
దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద హ్యుందాయ్ IPO అక్టోబర్ 14న ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ భారతీయ విభాగం కంపెనీ, ప్రమోటర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.
News October 4, 2024
కేటీఆర్, హరీశ్‌పై కేసు నమోదు
TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్‌లో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేటీఆర్, హరీశ్‌తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News October 4, 2024
నిజం మాట్లాడినందుకు క్షమించండి: కర్ణాటక మంత్రి
హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ గొడ్డు మాంసం తినేవారని చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి దినేష్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సావర్కర్ గొడ్డు మాంసం తినడం మాత్రమే కాకుండా, ఆ ఆచారాన్ని బహిరంగంగా ప్రచారం చేశారని చెప్పడంతో వివాదం చెలరేగింది. దీంతో ‘నిజం మాట్లాడినందుకు క్షమించండి’ అని దినేష్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సావర్కర్ బ్రిటిష్ వారికి చెప్పారంటూ పోస్ట్ చేశారు.