News October 22, 2024
రెండో టెస్ట్ మ్యాచ్‌కు స్లో పిచ్!
భారత్-న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం పుణే స్టేడియంలో స్లో పిచ్ సిద్ధమవుతోంది! బెంగళూరు పిచ్‌తో పోలిస్తే ఫ్లాట్‌గా ఉండి తక్కువ బౌన్స్‌తో ఉంటుందని తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో ఓటమి తరువాత రెండో మ్యాచ్‌లో గెలుపు కోసం భారత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. WTC ఫైనల్ రేసులో ముందుండాలంటే 2-1తో సిరీస్ గెలవడం భారత్‌కు అత్యవసరం.
Similar News
News November 12, 2024
అమెరికన్ M4 రైఫిల్స్.. అఫ్గాన్ టు భారత్ వయా పాక్
ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. US బలగాలు 2021లో అఫ్గాన్‌ను వీడుతూ $7bn విలువైన ఆయుధాలను వదిలేశాయి. వాటిలో వేలాదిగా M4 రైఫిల్స్ ఉన్నాయి. లైట్ వెయిట్‌తో ఉండే వీటి ద్వారా నిమిషానికి 700-900 రౌండ్స్ కాల్చవచ్చు. రేంజ్ 500M-3,600M వరకు ఉంటుంది.
News November 12, 2024
అమృత్ టెండర్లలో అవినీతి పెద్ద జోక్: కోమటిరెడ్డి
TG: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అని చెప్పారు. ‘CM రేవంత్‌కు సృజన్ రెడ్డి తోకచుట్టం. కవిత, సృజన్ రెడ్డిలు వ్యాపార భాగస్వాములు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి KTR సమాధానమివ్వాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.
News November 12, 2024
FLASH: హాల్‌టికెట్లు విడుదల
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC విడుదల చేసింది. అభ్యర్థులు <