News March 23, 2024

మరింత స్మార్ట్‌గా కంప్యూటర్లు: Nvidia సీఈవో

image

మానవాభివృద్ధి కోసం AI టెక్నాలజీని ఉపయోగిస్తామని Nvidia సీఈవో జెన్సన్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్లలో ఈ సంస్థ ఒకటి. ఓ ఇంటర్వ్యూలో జెన్సన్ మాట్లాడుతూ.. ‘మనుషులు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకునేంత స్మార్ట్‌గా కంప్యూటర్లు ఉండాలి. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రోగ్రామింగ్ అనేది ప్రత్యేకమైన స్కిల్ కాదు. యువత కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం ఉండదు’ అని పేర్కొన్నారు.

Similar News

News September 9, 2024

ఒకే కుటుంబంలో నలుగురికి పాము కాటు.. ముగ్గురి మృతి

image

ఒడిశాలోని బౌధ్ జిల్లాలో విషాదం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురిని పాము కాటేసింది. చరియపాలీ గ్రామానికి చెందిన ఓ తండ్రి, ముగ్గురు కూతుళ్లు ఆదివారం రాత్రి పాముకాటుకు గురయ్యారు. ఈక్రమంలో చిన్నారులు ముగ్గురూ(12, 9, 3 ఏళ్లు) కన్నుమూశారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు వారిని ఆస్పత్రి కంటే ముందు మంత్రగాడి వద్దకు తీసుకెళ్లడం వల్లే ప్రాణాలు పోయాయని స్థానికులు చెబుతున్నారు.

News September 9, 2024

సీఎం చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

image

AP: 2014-19 మధ్య CM చంద్రబాబు పర్సనల్ సెకట్రరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో పెండ్యాలదే కీలక పాత్ర అని సీఐడీ నోటీసులివ్వడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. దీంతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

News September 9, 2024

సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

image

TG: రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకరించాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇరుకు రహదారులతో పీక్ అవర్స్‌లో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.