News November 28, 2024
బాధ్యతలు చేపట్టిన స్మితా సభర్వాల్

TG: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 12న ఆమెకు ఈ పోస్టింగ్ కల్పించారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా ఇప్పటివరకు స్మిత అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.
Similar News
News December 3, 2025
పలు జిల్లాలకు వర్షసూచన

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 3, 2025
నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
News December 3, 2025
ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.


