News July 22, 2024

స్మిత వ్యాఖ్యలు సరికాదు: హరీశ్ రావు

image

TG: దివ్యాంగులపై స్మితా సభర్వాల్ చేసిన <<13679127>>వ్యాఖ్యలు<<>> సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేయకుండా గ్రామపంచాయతీల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను పాటించాలని కోరారు.

Similar News

News December 1, 2024

ALERT.. కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో చిరుజల్లులు కురిసిన సంగతి తెలిసిందే.

News December 1, 2024

రూ.10 కోసం పోలీసులకు ఫిర్యాదు!

image

రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించిన ఆసక్తికర ఘటన ఇది. UPలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర పాన్ షాప్ నడుపుకుంటున్నారు. సంజయ్ అనే కస్టమర్ ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొని రూ.10 అరువు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని విసిగిపోయిన జితేంద్ర, పోలీస్ హెల్ప్‌లైన్ 112కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.

News December 1, 2024

ఇది మ‌హారాష్ట్ర‌కు అవ‌మాన‌క‌రం: ఆదిత్య ఠాక్రే

image

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి వారం గ‌డుస్తున్నా ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌పోవ‌డం మ‌హారాష్ట్రకు అవ‌మాన‌క‌ర‌మ‌ని శివసేన UBT నేత ఆదిత్య ఠాక్రే విమ‌ర్శించారు. అసెంబ్లీ గ‌డువు ముగిసినా రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎందుకు విధించ‌డం లేదని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లాన్ని క్లైం చేసుకోకుండానే ప్ర‌మాణ‌స్వీకారానికి తేదీ ప్ర‌క‌టించ‌డం అరాచ‌క‌మ‌ని మండిప‌డ్డారు. వర్లీ నుంచి ఆదిత్య గెలిచిన విషయం తెలిసిందే.