News March 29, 2024

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

image

TG: హనుమకొండ జిల్లా కాజీపేట వద్ద పద్మావతి ఎక్స్‌ప్రెస్‌(సికింద్రాబాద్-తిరుపతి)లో పొగలు వచ్చాయి. బ్యాటరీ క్యాప్ లీక్ కావడంతోనే ఈ పొగలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో కాజీపేట స్టేషన్‌లో రైలును సుమారు గంటన్నర పాటు నిలిపివేసి మరమ్మతులు చేశారు. తర్వాత రైలు యథావిధిగా వెళ్లిపోయింది.

Similar News

News February 9, 2026

అసెంబ్లీకి జగన్, వైసీపీ MLAలు?

image

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు YCP అధినేత జగన్, ఆ పార్టీ MLAలు హాజరవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకరోజే అసెంబ్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. సభకు హాజరై 6 నెలల సమయం గడిచిన నేపథ్యంలో అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదే రోజు జగన్ అధ్యక్షతన YCP శాసనసభాపక్ష సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

News February 9, 2026

టాలెంట్‌కు పరీక్షలు కొలమానం కాదు: శ్రీధర్ వెంబు

image

టాలెంట్‌ను కొలవడంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ప్రమాణాలు కాదని ZOHO కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు అన్నారు. నిజ జీవితంలో ఓ వ్యక్తి అసాధారణ ప్రతిభను వీటి ద్వారా గుర్తించలేరని పేర్కొన్నారు. ఫ్రెంచ్ మ్యాథమెటీషియన్ డ్యుమినిల్ ఎప్పుడూ మ్యాథ్స్ కాంపిటీషన్‌లో పాల్గొనలేదని, అయినా సత్తా ఏంటో చూపారని Meta AI మాజీ శాస్త్రవేత్త యాన్ లెకన్ ట్వీట్ చేశారు. యాన్ కామెంట్స్‌కు మద్దతుగా వెంబు ఈ విధంగా స్పందించారు.

News February 9, 2026

ఆ డైరెక్టర్లు తిట్టినా.. డబ్బుకోసమే పనిచేశా: నటి

image

తాను నటించిన కొన్ని సినిమాలు విడుదలవ్వకూడదని ప్రార్థించినట్లు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొన్నారు. తాను కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలు ఎందుకు సైన్ చేశానా అని బాధ పడ్డా. సెట్‌లో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు డైరెక్టర్లు అకారణంగా నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు కోసమే వాటిని పూర్తి చేశాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.