News February 25, 2025
సిగరెట్ తాగితే ఎముకలు బలంగా ఉండవు!

పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్‌పై ఉన్నప్పటికీ ఎవ్వరూ దానిని పట్టించుకోరు. అయితే, సిగరెట్ వల్ల శరీరంలోని ఎముకలు కూడా దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. వాటి పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం మీ ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని తెలిపారు.
Similar News
News March 26, 2025
జాగ్రత్త.. ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. !

ఉదయాన్నే నిద్ర లేవగానే చాలా నీరసం, కళ్లు తిరిగినట్లు అనిపించడం, రాత్రంతా పలుమార్లు మూత్రవిసర్జనకోసం లేవాల్సి రావడం, నాలుక-పెదాలు మాట్లాడలేనంతగా తడారిపోవడం, టైమ్‌కి తినకపోతే శరీరం వణుకు రావడం.. ఇవన్నీ షుగర్ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
News March 26, 2025
భారతీయులకు బంపరాఫర్.. విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. సమ్మర్‌లో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ఇండియన్స్‌కు 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, ప్రాగ్, గ్రీస్, వార్సా రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 28లోగా బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చని వెల్లడించింది.
News March 26, 2025
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి

TG: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని పంపించనున్నారు. ఈ మేరకు కాకినాడ పోర్టుకు రైస్ చేరింది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌక ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం ఆ దేశ ప్రతినిధులతో రైస్ ఎగుమతికి ఒప్పందం జరిగింది. 8లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.