News January 27, 2025
ICC వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి

2024కు గాను ICC ఉమెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారత ప్లేయర్ స్మృతి మంధాన సొంతం చేసుకున్నారు. ఆమె రెండోసారి ఈ అవార్డుకు ఎంపికవడం విశేషం. గత ఏడాది స్మృతి 13 ఇన్నింగ్స్‌లలో 747 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలున్నాయి. ఇక ICC మెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా సాధించారు. ఈయన 14 మ్యాచ్‌లలో 417 రన్స్‌తో పాటు 17 వికెట్లను పడగొట్టారు.
Similar News
News November 23, 2025
అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: ద.అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని IMD వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఈనెల 30 నాటికి తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉందని, NOV 28 నుంచి వర్షాలు పెరుగుతాయని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.
News November 23, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News November 23, 2025
దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమా?

దీపంలో వత్తి పూర్తిగా కాలిపోవడం ఎలాంటి అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. వత్తి పూర్తిగా కాలిపోవడం, దీపం మధ్యలోనే ఆగిపోవడం అనేవి భౌతిక కారణాల వల్ల మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ‘వీటికి దైవిక దోషాలు, ఎలాంటి అశుభ కారణాలు లేవు. దీపం ఎప్పుడూ సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. కాబట్టి ఈ పరిణామాల వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. భయపడవలసిన అవసరం లేదు’ అని వివరిస్తున్నారు.


